Tue Nov 26 2024 00:49:58 GMT+0000 (Coordinated Universal Time)
జంట పేలుళ్ల కేసులో మరో దోషి
హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో మరో వ్యక్తిని ఎన్ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. పేలుళ్ల తర్వాత ఉగ్రవాదులకు మహ్మద్ తారిఖ్ అంజుమ్ హసన్ అనే వ్యక్తి ఢిల్లీలో ఆశ్రయం కల్పించాడు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని దోషులుగా నిర్ధారించిన కోర్టు ఇప్పడు ఏ-5గా ఉన్న తారిఖ్ ను కూడా దోషిగా తేల్చింది. బీహార్‌లోని నలంద ప్రాంతానికి చెందిన ఇతడు కర్ణాటకలోని భత్కల్‌లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అదే వృత్తిలో ఉన్న ఇతడు 1998లో సిమీ సభ్యుడిగా మారాడు. 2001లో రియాజ్ ద్వారా ఇండియన్ ముజాహిద్దీన్ లోకి ప్రవేశించాడు. అమీర్ రజాఖాన్ నేతృత్వంలో జరిగిన కోల్‌కతా ఎటాక్‌లోనూ కీలక పాత్ర పోషించాడు. ఐఎంలోని ‘టాప్ సిక్స్’లో ఒకడిగా, దుబాయ్ నుంచి ఫైనాన్సియర్‌గా వ్యవహరించాడు. ఇక ఇప్పటికే జంట పేలుళ్ల కేసులో దోషులుగా తేల్చినవారికి ఇవాళ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.
Next Story