Sat Dec 21 2024 10:50:38 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ - ఇండియా టీ 20.. రెడీ అయిపోండి
ఈరోజు ఐసీసీ టీ 20 మహిళ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో ఆడేందుకు భారత్ జట్టు సిద్ధమయింది.
ఆట ఎవరాడినా సరే. పాక్ - ఇండియా మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. ఇటు భారత్, అటు పాక్ లో అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ఎక్కడైనా సరే గెలుపు తమదే ఉండాలని ఆకాంక్షిస్తారు. పురుషులైనా, మహిళైనా పెద్దగా తేడా ఉండదు. ఆడేది ఎవరు? పాక్ - ఇండియా అది చాలు. క్రికెట్ ఫ్యాన్ పిచ్చెక్కిపోతారు. తమ టీం గెలవాలంటూ ప్రార్థనలు చేస్తుంటారు. తమ టీం గెలుస్తుందని జోరుగా బెట్టింగ్‌లు కూడా కడతారు.
టెన్షన్ తప్పదా?
ఒక్క పాక్ - ఇండియా మ్యాచ్‌లకే అది సాధ్యమవుతుంది. మరే దేశంతో భారత్ తలపడుతున్నా అంతటి టెన్షన్ ఉండదు. కేవలం పాక్ తో తలపడినప్పుడే ఆ వాతావరణం చెప్పకుండానే క్రియేట్ అవుతుంది. క్రికెట్ కు ఉండే లక్షణమే అది. ఈరోజు ఐసీసీ టీ 20 మహిళ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో ఆడేందుకు భారత్ జట్టు సిద్ధమయింది. రాత్రి 7 గంటల నుంచి కేప్‌టౌన్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది.
భారీ స్కోరు చేస్తేనే...
ఈ కీలకపోరులో భారత్ ఫేవరెట్ గా నిలుస్తుందని బెట్టింగ్‌లు అప్పుడే ప్రారంభమయ్యాయి. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ నేతృత్వంలో ఇండియా జట్టు పాక్ ను మట్టి కరిపించేందుకు రెడీ అయిపోయింది. అయితే స్టార్ బ్యాటర్ స్మృతి మంథాన గాయపడటంతో ఆమె ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఇది ఒకరకంగా ఇబ్బందికరమైన పరిణామమే. దీంతో బ్యాటర్లు హర్మన్ ప్రీత్, షెఫలీ వర్మ, రిచా ఘోష్, జెమీమాలు కీలకంగా మారనున్నారు. బౌలింగ్ కొంత బలహీనంగా ఉండటంతో భారత్ భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా.
Next Story