ఒకే రోజు.. నాలుగు వేల భూకంపాల దాడి
అవును. మీరు విన్నది నిజమే. ఉత్తర యూరప్‌లో ఉన్న ఐస్‌ల్యాండ్ అనే దేశంలో గత 14 గంటల్లో నాలుగు వేల భూకంపాలు సంభవించాయి. అందులో ఓ మోస్తరు నుంచి భారీ భూకంపాలు 800 దాకా ఉన్నాయి. పరిస్థితి అల్లకల్లోలం కావడంతో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గ్రీన్లాండ్ సముద్రం, నార్త్ అట్లాంటిక్ మహా సముద్రాల మధ్య ఉంది ఈ చిన్న ద్వీప దేశం.

శుక్రవారం నుంచి ఆ దేశంలోని నైరుతివైపు ఉన్న రేక్జేన్స్ అనే పెనిన్సులా (ఓ చిన్న ద్వీప కల్పం.. అంటే మూడు వైపులా నీరు, ఒకవైపు భూమి ఉన్న ప్రాంతం) మీద భూకంపాల ఉప్పెన మొదలైంది. దీనివల్ల అగ్ని పర్వతాలు బద్దలై, లావా విరజిమ్మే ప్రమాదం కూడా ఉందని అక్కడి అధికారులు జనాన్ని హెచ్చరించారు. అత్యధికంగా 5.2 తీవ్రతలో భూమి కంపించినట్లు వారు వెల్లడించారు.
పద్నాలుగు గంటల వ్యవధిలో సంభవించిన వేల భూకంపాలతో ఐస్లాండ్ లో ఆస్తి నష్టం ఏర్పడింది. నాలుగు లక్షల మంది కంటే తక్కువ జనాభా ఉండే ఈ ప్రాంతానికి భూకంపాలు, అగ్ని పర్వతాల తాకిడి కొత్త కాదు.