Sun Dec 22 2024 12:40:37 GMT+0000 (Coordinated Universal Time)
నాడు జగన్ రాంగ్ - నేడు రేవంత రైట్ ...అదెలా డ్యూడ్?
తొక్కిసలాట జరిగితే కేసులు నమోదు చేయడం సర్వసాధారణం. జగన్ కు ఒక న్యాయం.. రేవంత్ కు మరొక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు
ఎక్కడైనా తొక్కిసలాట జరిగితే అందుకు బాధ్యులను చేస్తూ కేసులు నమోదు చేయడం సర్వసాధారణం. . కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు, హైదరాబాద్ లో జరిగిన సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటకు మధ్య పొంతన పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నాడు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టిన వారు, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తుండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రెండు ఘటన ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఒక న్యాయం.. మరొక ప్రభుత్వం తీసుకుంటే మరొకరకమైన అభిప్రాయమా? అని ప్రశ్నిస్తున్నారు.
కందుకూరు ఘటనపై..
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరులోతెలుగుదేశం పార్టీ ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్కక్రమం ఎన్నికలకు ముందు చేపట్టింది ఈ కార్కక్రమానికి అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అయితే కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది వరకూ మరణించారు. అనేక మందికి గాయాలయ్యాయి. అయితే అదే సమయంలో టీడీపీ మరణించిన కుటుంబాలకు పరిహారం పార్టీ తరుపున అందించింది. ప్రభుత్వం కూడా కొంత సాయం చేసింది. ఇరుకు సందులో ఏర్పాటు చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, పోలీసుల అనుమతి తీసుకోకుండా అప్పట్లో నిర్వాహకులు సభను ఏర్పాటు చేశారన్న వార్తలు వచ్చాయి. ఇక గుంటూరులో టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు మరణించారు. ఉయ్యూరు ఫౌండేషన్ పేదలకు కానుకలను పంపిణీ చేయడంలో భాగంగా తొక్కిసలాట జరిగి మహిళలు మరణించారు. కందుకూరులో జరిగిన సంఘటనపై అప్పటి జగన్ ప్రభుత్వం శేషశయనారెడ్డి కమిషన్ వేసింది. విచారణ చేపట్టింది. కేసులు నమోదు చేసింది.
ఇరుకు సందుల్లో...
అయితే ఇరుకుసందుల్లో సభలను ఏర్పాటు చేయడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీనికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే నాడు అలా బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకపోవడంపై జగన్ ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు అదే జరిగింది. నాడు తొక్కిసలాటలో రాజకీయ నాయకులు కారణమైతే. ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన తొక్కిసలాటకు కారణం సినీ హీరో. ఎవరైనా ఒకటే. అక్కడా ప్రాణాలే.. ఇక్కడా ప్రాణాలే. కానీ రేవంత్ రెడ్డి బెన్ ఫిట్ షోలు రద్దు, ధరలను పెంచబోమంటూ తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సోషల్ మీడియాలో అనేక మంది స్వాగతిస్తున్నారు. కానీ అప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం చేసింది కూడా అదే కదా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎన్నికల సందర్భంగా ప్రచార సభలను ఇరుకు సందుల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపడుతూ అప్పట్లో అనేక మంది పోస్టులు పెట్టారు. ఇప్పుడు వారే రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. రెండింటీకీ తేడా ఏంటో? మరి రాష్ట్రం మారిందా? ప్రభుత్వాలు మారాయా? అంటూ కామెంట్స్ నెట్టింట జోరుగా కనిపిస్తున్నాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story