కరోనా ఎఫెక్ట్… వారికి కేంద్రం భారీ ప్యాకేజీ
కరోనా ప్రభావంతో కేంద్ర పేదల కోసం భారీ ప్యాకేజీని ప్రకటించింది. గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద లక్షా 70 వేల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని [more]
కరోనా ప్రభావంతో కేంద్ర పేదల కోసం భారీ ప్యాకేజీని ప్రకటించింది. గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద లక్షా 70 వేల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని [more]
కరోనా ప్రభావంతో కేంద్ర పేదల కోసం భారీ ప్యాకేజీని ప్రకటించింది. గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద లక్షా 70 వేల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన కార్మికులకు, పేదలకు ఈ పథకం వర్తించనుంది. ఆకలి చావులు దేశంలో లేకుండా చేయడానికే ఈ ప్రయత్నం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి ఆరోగ్య బీమాను కేంద్రం ప్రకటించింది. యాభై లక్షల బీమాను వీరికి వర్తింప చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద నెలకు ఐదు కేజీల బియ్యం లేదా గోధుమలు సప్లయ్ చేస్తారు. మూడు నెలలకు సరిపడా ధాన్యం అందిస్తారు. ఇప్పుడు ఇస్తున్న దానికి ఇది అదనం. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. పేదలు, రోజు కూలీల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ప్రజలు ఎవరూ ఆకలి బాధతో ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. పేదలకు నేరుగా సాయం అందించే చర్యలు చేపట్టిందన్నారు. రైతులకు, వితంతువులకు, వృద్ధులు, దివ్యాంగులు, అనాధలకు కూడా ఆర్థిక సాయం అందజేయనుంది.