భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యత ఏమిటి ? ఎందుకు ఇది పెద్దపండుగ ?
భోగితో మొదలయ్యే ఈ పండుగను నాలుగురోజులపాటు జరుపుకుంటారు. నిజానికి ఈ పండుగ వెనుక ఉన్న ప్రాముఖ్యత చాలా కొద్దిమందికే తెలుసు. సంక్రాంతినే పెద్ద పండుగ అని
రెండ్రోజుల్లో పెద్ద పండుగ రానే వస్తోంది. భోగితో మొదలయ్యే ఈ పండుగను నాలుగురోజులపాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ.. ఇలా నాలుగురోజుల పండుగకు పల్లెలు ఎంతో శోభాయమానంగా ముస్తాబవుతాయి. జనాలు కాంక్రీటు పట్టణాలను వదిలి.. పండుగల కోసం పల్లెల బాటపడతారు. అందుకే సంక్రాంతి అంటే.. పల్లెల్లో జరుపుకునే అతిపెద్ద పండుగ అని అందరూ భావిస్తారు.. కానీ నిజానికి ఈ పండుగ వెనుక ఉన్న ప్రాముఖ్యత చాలా కొద్దిమందికే తెలుసు. సంక్రాంతినే పెద్ద పండుగ అని ఎందుకంటారు ? దీనివెనకున్న ఆంతర్యమేమిటో మనమూ తెలుసుకుందాం !
సంక్రాంతి అంటే.. తెలుగు ప్రజల పెద్ద పండుగ. కోస్తాంధ్ర, రాయలసీమ, కోనసీమల్లో ఈ పండుగ శోభ కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రంగురంగుల రంగవల్లులు, కొత్తబట్టలు, భోగిపళ్లు, గొబ్బెమ్మలు, పిండివంటలు, గంగిరెద్దులు, డూడూ బసవన్నలు, కోడి పందాలు, హరిదాసులు ఇలా సంక్రాంతి పెద్ద కళే తీసుకొస్తుంది పల్లెటూళ్లకు. సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు.