Mon Dec 23 2024 08:44:20 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ లో మధ్యంతర ఎన్నికలు...?
పాకిస్థాన్ పార్లమెంటును రద్దు చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫార్సు చేశారు. దీంతో పాక్ లో మధ్యంతర ఎన్నికలు రానున్నాయి.
పాకిస్థాన్ పార్లమెంటును రద్దు చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫార్సు చేశారు. దీంతో పాక్ లో మధ్యంతర ఎన్నికలు రానున్నాయి. ప్రతిపక్షాలు మొత్తం ఏకమై తనపై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన తొలుత ప్రధాని పదవికి రాజీనామా చేయాలనుకున్నారు. వచ్చే ఏడాది పాక్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అవిశ్వాసం తో తాను రాజీనామా చేసేకన్నా పాక్ పార్లమెంటునే రద్దు చేయడంమే బెటర్ అని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించుకుని ఆ మేరకు సిఫార్సు చేశారు.
ఊరట లభించినా.....
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తోసిపుచ్చారు. అవిశ్వాస తీర్మానం వెనక విదేశీ శక్తుల కుట్ర ఉందని స్పీకర్ అభిప్రాయపడ్డారు. దీంతో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తోసి పుచ్చడంతో ప్రధాని పదవి గండం నుంచి తాత్కాలికంగా బయటపడినట్లే.
సభకు దూరంగా.....
ఈరోజు విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఈరోజు ఓటింగ్ జరగాల్సి ఉంది. సభకు ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. సొంత పార్టీ నుంచి 22 మంది, విపక్షాల నుంచి 176 మంది సభ్యులు హాజరయ్యారు. విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించినట్లు స్పీకర్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇమ్రాన్ పార్లమెంటును రద్దు చేయాలని సిఫార్సు చేయడం విశేషం.
Next Story