Wed Jan 08 2025 18:26:19 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే నెల నుంచి ఒంటిపూట బడులు
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఒక పూట బడులు మాత్రమే జరుగుతాయన్నారు. ఉదయం 7.45 గంటల నుంచి 11. 30 గంటల వరకు మాత్రమే తరగతులు ఉంటాయి. మధ్యాహ్నం భోజనం యధాతధంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఒంటిపూట బడుల నిర్వహణలో కూడా అన్ని రకాలుగా కోవిడ్ నిబంధనలను పాటించాలని అధికారులను ఆదేశించారు.
Next Story