మందుబాబులకు చుక్కలు చూపుతున్న పోలీసులు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మందుబాబులకు పోలీసులు చుక్కలు చూపెడుతున్నారు. తాగి వాహనం నడుపుతున్న వారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. దీంతో పాటుగా మందుబాబులు కోర్టులో హాజరు [more]
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మందుబాబులకు పోలీసులు చుక్కలు చూపెడుతున్నారు. తాగి వాహనం నడుపుతున్న వారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. దీంతో పాటుగా మందుబాబులు కోర్టులో హాజరు [more]
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మందుబాబులకు పోలీసులు చుక్కలు చూపెడుతున్నారు. తాగి వాహనం నడుపుతున్న వారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. దీంతో పాటుగా మందుబాబులు కోర్టులో హాజరు పరుస్తారు. వారం రోజుల పరిధిలో పట్టుకున్న మందుబాబులకు జైలుశిక్ష విధించారు. వీరిని వివిధ స్థానిక కోర్టుల్లో హాజరుపర్చగా న్యాయమూర్తులు 269 మంది మందుబాబులకు ఒక రోజు నుంచి 18 రోజుల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కోసం ఆర్టీఓ అధికారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిఫార్సు చేయనున్నారు. అత్యధికంగా మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 161 మంది పోలీసులకు చిక్కారు.