Sun Dec 22 2024 19:18:26 GMT+0000 (Coordinated Universal Time)
లాక్ డౌన్ మినహాయింపు సమయమే డేంజర్ అట
తెలంగాణలో లాక్ డౌన్ మినహాయింపు సమయంలో రద్దీ ఎక్కువవుతోంది. దీంతో కేసుల సంఖ్య మరింత ఎక్కువవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల [more]
తెలంగాణలో లాక్ డౌన్ మినహాయింపు సమయంలో రద్దీ ఎక్కువవుతోంది. దీంతో కేసుల సంఖ్య మరింత ఎక్కువవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల [more]
తెలంగాణలో లాక్ డౌన్ మినహాయింపు సమయంలో రద్దీ ఎక్కువవుతోంది. దీంతో కేసుల సంఖ్య మరింత ఎక్కువవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు అనుమతిచ్చారు. అయితే అనేక దుకాణాలు, మాల్స్ జనంతో రద్దీగా కన్పిస్తున్నాయి. ఒక్కసారిగా బయటకు వస్తుండటం, భౌతిక దూరం పాటించకపోతుండటంతో వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
Next Story