జగన్ దిగి వచ్చారా?
నిన్నటి వరకూ సమీక్షల్లో ఎమ్మెల్యేలపై సీరియస్ అయిన జగన్ నిన్నటి సమావేశంలో కూల్ గా ఉండటం మార్పునకు నిదర్శనమంటున్నారు
ఎప్పుడు తగ్గడమే కాదు.. ఎలా నెగ్గాలో తెలిసిన వాళ్లే అసలు సిసలైన రాజకీయ నేత. ఇది పాత డైలాగైనా ఎప్పటికీ పాలిటిక్స్‌లో నానుతూనే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు సహజంగా నియంతృత్వానికి చిరునామాలు. జాతీయ పార్టీలలో ఉన్న ప్రజాస్వామ్యం ప్రాంతీయ పార్టీల్లో కనిపించదు. అధినేత చెప్పిందే వేదం. ఆయన తీసుకున్న నిర్ణయమే ఫైనల్. అది తెలుగుదేశం పార్టీ అయినా.. వైసీపీ అయినా.. చంద్రబాబు అయినా.. జగన్ అయినా.. అధికారంలో ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా వ్యవహరిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు తమ వల్లే గెలిచారనుకుని ఎవరినీ లెక్క చేయరు. అదే కొన్ని సార్లు రాజకీయంగా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. చంద్రబాబు కూడా పవర్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను కేర్ కూడా చేయలేదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలతోనే కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. నేతలను లైన్లోకి తీసుకురావడానికి పెద్ద కసరత్తులే చేయాల్సి వచ్చింది.