రీడర్.. లీడర్.. రూలర్
సీఎన్ఓఎస్ తాజాగా విడుదల చేసిన సర్వే ఫలితాల్లో కేసీఆర్ నాయకత్వంపై 49 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నట్లు తేలింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలతో ప్రజలను తన వశం చేసుకుంటారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఆయనకు అదే పెద్ద ఆస్తి. ఆయన ప్రసంగం విన్నవారు ఫిదా అయిపోతారు. మాటలతో మాయ చేస్తున్నారనుకోవచ్చు. లేదా నిజాలను చెప్పి ప్రజలను చైతన్యపరుస్తున్నారనుకోవచ్చు. ప్రత్యర్థులు, ఆయనను సమర్థించే వారు ఎలాగైనా భావించవచ్చు. ముఖ్యమంత్రుల్లో అంత అలవోకగా మాట్లాడే నేత కేసీఆర్ అనే చెప్పుకోవాలి. స్క్రిప్ట్ లేకుండా రెండు, మూడు గంటలు అనర్గళంగా మాట్లాడగలిగిన నేత కావడంతోనే ఆయన వెంట జనం నడిచారు. అది మీడియా సమావేశం కావచ్చు. బహిరంగ సభ కావచ్చు. కేసీఆర్ ప్రసంగం అంటేనే అందరూ ఆసక్తిగా వింటారు. అంత అటెన్షన్ ను ఆయన తెప్పిస్తారు. అందుకే సీఎన్ఓఎస్ తాజాగా విడుదల చేసిన సర్వే ఫలితాల్లో ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ 11వ స్థానంలో నిలిచారు. ఆయన నాయకత్వంపై 49 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నట్లు తేలింది. 19 మంది మాత్రమే అసంతృప్తితో ఉన్ారు. 24 మంది తటస్థంగా ఉన్నారని సర్వే ఫలితాలు తెలిపాయి.