బాబు బుక్కయినట్లేనా?
గత ఫిబ్రవరి 6న ఒక ప్రముఖ ఇన్ ఫ్రా కంపెనీ కి చెందిన 40 ప్రదేశాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేత అహ్మద్ [more]
గత ఫిబ్రవరి 6న ఒక ప్రముఖ ఇన్ ఫ్రా కంపెనీ కి చెందిన 40 ప్రదేశాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేత అహ్మద్ [more]
గత ఫిబ్రవరి 6న ఒక ప్రముఖ ఇన్ ఫ్రా కంపెనీ కి చెందిన 40 ప్రదేశాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేత అహ్మద్ పటేల్ కు 14వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని అదే నెల 11వ తేదీన సమన్లు పంపింది. ఈ విషయాన్నీ ధృవీకరిస్తూ తనకు ఆరోగ్యం కూడా బాగాలేదని, అదీగాక పార్లమెంటు వ్యవహారాల్లో బిజీ గా ఉన్నానని, అందులో ఒక సమన్ పార్లమెంట్ ఇమెయిల్ కు పంపారని చెప్పారు. ప్రతీ రాజకీయపార్టీకు అటువంటి వ్యవహారాలు సహజమేనని,త్వరలోనే ఈ సమన్లకు స్పందిస్తానని అహ్మద్ పటేల్ తెలిపారు.
ఆ సెక్షన్ ప్రకారమే….
2019 అక్టోబరులో ఆదాయపన్ను శాఖ హైదరాబాద్ లో నిర్వహించిన సోదాలలో 170 కోట్లు పంపిణీ జరిగినట్లుగా గుర్తించిన అనంతరం పంపిన సమన్లకు సమాధానం చెప్పటానికి జూనియర్ స్థాయి నేతలనును కాంగ్రెస్ పార్టీ పంపిందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారులు చెపుతున్నారు. ఆదాయపన్ను సెక్షన్ 131 ప్రకారం అహ్మద్ పటేల్ కు ఈ సమన్లు పంపారు.
ఇక్కడి నుంచే నగదు….
గతంలో వచ్చిన వార్తల ప్రకారం భోపాల్, ఇండోర్, గోవా, న్యూఢిల్లీ 2019 ఎన్నికల సమయంలో మధ్యప్రదేశ్ లోని పలు ప్రభుత్వ శాఖల నుంచి కాంగ్రెస్ పార్టీకి నగదు అందినట్టు ఆధారాలు ఉన్నాయని ఆదాయపన్ను శాఖ ధృవీకరించింది. దీనితోపాటు మరో 20 కోట్లు కాంగ్రెస్ నాయకుడు కమలనాథ్ కు అందినట్టు కూడా ఆదాయపన్ను శాఖ పేర్కొంది. సెక్షన్ 13ఏ ప్రకారం మొత్తం అన్ని కలిపి 400 కోట్లు అందినట్టు సమాచారం.
మొత్తంగా 2000 కోట్లు….
హైదరాబాద్, కడప, విజయవాడ, విశాఖపట్నం లలో నిర్వహించిన సోదాల్లో పార్టీ వ్యక్తులకు మొత్తంగా 2000 కోట్లు వరకు అందినట్టు సమాచారం. ఏపి లో ప్రముఖ వ్యక్తి ని త్వరలో ఐటీ అధికారులు విచారించనున్నట్టు సమాచారం. ఇటీవలే చంద్రబాబు మాజీ పీఏ ను ఆరు రోజులపాటు ఐటీ అధికారులు విచారించారు.