Mon Dec 23 2024 17:32:34 GMT+0000 (Coordinated Universal Time)
కాలరెగరేసి మరీ సెమీ ఫైనల్ కు
భారత్ సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లోనూ భారత్ దే విజయం అయింది. 71 పరుగుల తేడాతో గెలిచింది
భారత్ సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. జింబాబ్వేతో జరిగిన చివరి మ్యాచ్ లోనూ భారత్ దే విజయం అయింది. 71 పరుగుల తేడాతో గెలిచింది. సూపర్ 12లో ఐదు మ్యాచ్ లు ఆడిన భారత్ నాలుగింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఎనిమిది పాయింట్లతో గ్రూప్ బీ లో భారత్ సెమీస్ కు చేరకుంది. ఉదయం జరిగిన సౌతాఫ్రికా - నెదర్లాండ్స్ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓటమి పాలయిన వెంటనే సెమీస్ కు వెళ్లినా, ఇప్పుడు జింబాబ్వే మీద గెలిచిన భారత్ కాలరెగేసుకుని మరీ సెమీ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది.
భారీ స్కోరు చేసి...
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 186 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో జింబాబ్వే ముందు భారీ స్కోరును ఉంచగలిగారు. కేఎల్ రాహుల్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పెవిలియన్ కు చేరాడు. కొహ్లి 26 పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించాడు. 61 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ భారీ స్కోరు చేయగలిగింది.
బౌలర్ల దెబ్బకు...
ఇక తర్వాత 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే ఆదిలోనే తడబడింది. తొలి ఓవర్ లోనే ఒక వికెట్ పడింది. తర్వాత వరసగా వికెట్లు కోల్పోవడంతో జింబాబ్వే ఓటమి ఎప్పుడో ఖామయింది. అశ్విన్ అత్యధికంగా మూడు వికెట్లు తీసుకున్నారు. జింబాబ్వే బ్యాటర్లలో ఒక రాజా ఒక్కరే అత్యధిక పరుగులు చేయగలిగారు. ఎనిమిది పాయింట్లతో భారత్ సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. సెమీ ఫైనల్స్ లో భారత్ ఇంగ్లండ్ తో తలపడనుంది.
- Tags
- india
- semi finals
Next Story