Sat Dec 21 2024 02:30:07 GMT+0000 (Coordinated Universal Time)
గెట్ రెడీ... నరాలు తెగిపోతాయ్ అంతే
పాక్ తో ఈనెల 28వ తేదీన భారత్ క్రికెెట్ మ్యాచ్ జరగబోతుంది. ఆసియా కప్ లో భాగంగా ఈ మ్యాచ్ ను నిర్వహిస్తున్నారు
భారత్ - పాక్ క్రికెట్ మ్యాచ్ కోసం రెండు దేశాల్లో క్రికెట్ అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. నరాలు తెగేంత ఉత్కంఠత ఈ మ్యాచ్ జరిగేటప్పుడు ఉంటుంది. అందుకే రెండు దేశాల్లో క్రికెట్ అభిమానులు ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఆ సమయం రానే వచ్చింది. కేవలం రెండు దేశాల్లోనే కాదు ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసతుంది. దాయాది దేశం పాక్ తో ఈనెల 28వ తేదీన ఈ మ్యాచ్ దుబాయ్ లో జరగబోతుంది. బాల్ బాల్ కి టెన్షన్. ప్రతి నిమిషం కన్నార్పకుండా చూసే మ్యాచ్ ఇది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే మ్యాచ్ ఇది.
ఆసియా కప్....
ఆసియా కప్ 2022 షెడ్యూల్ ను ప్రకటించారు. దుబాయ్, షార్జాలలో జరిగే ఈ మ్యాచ్ లలు ఈ నెల 27వ తేదీ నంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 28వ తేదీన పాక్ - భారత్ మ్యాచ్ ఉంటుంది. దుబాయ్ లో తొలి మ్యాచ్ శ్రీలంక - ఆప్ఘనిస్థాన్ ల మధ్య జరగనుంది. ఆసియా కప్ లో జరిగే పాక్ - భారత్ మ్యాచ్ కు విపరీతమైన రేటింగ్ ఉంటుంది. అందుకే ఆదివారం రోజు ఈ మ్యాచ్ ను పెట్టినట్లు కనపడుతుంది. ఎప్పుడు తలపడినా ఉత్కంఠ భరితంగా సాగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు.
Next Story