Sat Nov 23 2024 07:15:13 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : భారత్ దే మూడో వన్డే.. సిరీస్ సొంతం
మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. సిరీస్ ను సొంతం చేసుకుంది.
మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. సిరీస్ ను సొంతం చేసుకుంది. 19.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా ఉంచిన లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ భారత్ పరమయింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో భారత్ బౌలర్లు విజృంభించారు. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా బ్యాటర్లను కుప్ప కూల్చారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లను ముప్పుతిప్పలు పెట్టింది. కేవలం 27 ఓవర్లలోనే ఆలౌట్ చేశారు. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ రెండు, మహ్మద్ ిరాజ్ రెండు, శాబాజ్ అహ్మద్ రెండు వికెట్లు పడకొట్టి ఆటను తమ చేతుల్లోకి తీసుకున్నారు.
తొలుత తడబడినా...
దక్షాఫ్రికా బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసిన్ మాత్రమే ఎక్కువ పరుగులు చేశాడు. 34 పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత మలాన్ పదిహేను, క్వింటన్ డికాక్ ఆరు, హెడ్రిక్స్ మూడు పరుగులకే పెవిలియన్ కు చేరారు. యాభై ఓవర్లలో 100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. థావన్ అనవసరపు పరుగుకు ప్రయత్నించి అవుటయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ పది పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓపెనర్ గా దిగిన గిల్ చివర వరకూ పోరాడాడు. అర్థ సెంచరీ పూర్తి చేసుకుంటాడనుకుంటే.. 49 పరుగుల వద్ద అవుటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడటంతో భారత్ కు విజయం దక్కింది. కేవలం ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని పూర్తి చేసి సిరీస్ ను సొంతం చేసుకుంది.
Next Story