Mon Dec 23 2024 11:44:24 GMT+0000 (Coordinated Universal Time)
రైల్వే గార్డ్ పేరు మార్చిన ఇండియన్ రైల్వే
రైలు చివరి పెట్టె ద్వారం వద్ద తెల్లని ప్యాంట్, షర్ట్ వేసుకుని, చేతిలో పచ్చజెండా పట్టుకుని ఓ వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి
రైల్వే గార్డ్.. ఈ పేరు చాలాసార్లు వినే ఉంటారు కదూ. రైలు చివరి పెట్టె ద్వారం వద్ద తెల్లని ప్యాంట్, షర్ట్ వేసుకుని, చేతిలో పచ్చజెండా పట్టుకుని ఓ వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తిని రైల్వే గార్డ్ అంటారు. ఇప్పుడు ఆ వ్యక్తి పేరును మార్చింది ఇండియన్ రైల్వే. రైల్వే గార్డును.. ట్రైన్ మేనేజర్ గా చేసింది. ఇండియన్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చేసింది. ఇకపై అందరూ ట్రైన్ మేనేజర్ అనే పిలవాల్సి ఉంటుంది.
Also Read : అమానుషం.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం
గార్డ్ అంటే రక్షకుడు, కాపలాదారుడు అనే అర్థాలు స్ఫుర్తిస్తాయి. కానీ రైల్వే గార్డ్ సేవలు అంతకుమించి ఉంటాయి కాబట్టి.. విధుల నిర్వహణలో వారిలో మరింత ప్రేరణ కలిగించేలా.. వారి పేరులో రైల్వే శాఖ ఈ మార్పును తీసుకొచ్చింది. పేరులో తప్పించి, వేతనాలు, బాధ్యతల్లో ఎలాంటి మార్పు ఉండదని భారతీయ రైల్వే స్పష్టం చేసింది.
Next Story