Fri Nov 22 2024 13:44:32 GMT+0000 (Coordinated Universal Time)
రష్యా బాంబు దాడిలో భారత విద్యార్థి మృతి
ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో ఒక భారతీయ విద్యార్థి క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయాడని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం..
ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. మంగళవారం రష్యా ఉక్రెయిన్ పై చేసిన బాంబు దాడిలో భారత విద్యార్థి మరణించాడు. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో ఒక భారతీయ విద్యార్థి క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయాడని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ధృవీకరించింది. మృతుడు నవీన్ గా గుర్తించారు. ఈ మేరకు అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. "ఈ ఉదయం ఖార్కివ్‌లో జరిగిన క్షిపణి దాడిలో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఖార్కివ్‌లో జరిగిన క్షిపణి దాడిలో నవీన్ అనే విద్యార్థి మరణించాడు. కర్ణాటకు చెందిన నవీన్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.
Also Read : కీవ్ కు చేరువలో రష్యా బలగాలు
నవీన్ తన అపార్ట్మెంట్ నుండి రైల్వే స్టేషన్ వైపు వెళుతుండగా దురదృష్టవశాత్తు క్షిపణి దాడిలో మరణించాడు" అని ట్వీట్ లో పేర్కొన్నారు. నవీన్ ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో మెడిసిన్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. ఖార్కివ్‌లో, ఇతరఘర్షణ ప్రాంతాలలో ఉన్న భారతీయ పౌరులకు అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విదేశాంగ కార్యదర్శి కోరారు. నవీన్ కుటుంబ సభ్యులతో భారత మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని అరిందమ్ బాగ్చి తెలిపారు. అతని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.
Next Story