Wed Dec 18 2024 04:44:37 GMT+0000 (Coordinated Universal Time)
Cold Waves : చలిగాలులు తగ్గేట్లు లేదుగా.. మరి ఇంకా ఎన్ని రోజులంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. గత ఆరేళ్లతో పోలిస్తే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. గత ఆరేళ్లతో పోలిస్తే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గత వారం రోజుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలికి గడ్డకట్టుకుపోతామోనన్న భయంలో ప్రజలు ఉన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో పెరిగిన భవన నిర్మాణలతో కాలుష్యం పెరిగిపోయి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే కొన్నేళ్ల నుంచి చలి అనేది పెద్దగా కనిపించలేదు. స్వెటర్లు, రజాయ్ ల వాడకం కూడా ప్రజలు పెద్దగా చేపట్టలేదు. డిసెంబరు, జనవరి మాసాల్లోనూ గత ఆరేళ్లలో ఇంతటి చలి ఎప్పుడూ లేదు.
చలి తీవ్రత పెరగడంతో...
అయితే గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్ నగరంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాల్లో చలి సింగిల్ డిజిట్ కు పడిపోయింది. ఇక్కడ 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరుల్లో కూడా పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో పదహారు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు. దీంతో నగరంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అదే సమయంలో విధులకు వెళ్లాల్సిన వారు కూడా ద్విచక్రవాహనాలను వదిలేసి మెట్రో రైళ్లలో బయలుదేరి వెళుతున్నారు.
వాయుగుండం ప్రభావంతో...
ఈ చలి తీవ్రత మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశమున్నందున రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని, చలి నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి వల్ల అనేక వ్యాధులు సంక్రమించే అవకాశమున్నందున మార్నింగ్ వాకర్స్ వాకింగ్ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ప్రధానంగా గుండె సంబంధింత వ్యాధులున్న వారు చలికి బయటకు రావద్దని కూడా చెబుతున్నారు. అలాగే ఏదైనా శ్వాసకోశ సమస్యలు ఎదుయితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్న సూచనలు వెలువడుతున్నాయి.
జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. పొద్దంతా వణికి స్తోంది. నాలుగు రోజులుగా మళ్లీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శనివారం జిల్లాను ఎల్లో అలర్ట్గా ప్రకటించారు. కనిష్ఠ ఉష్ణోగ్రత 10.6 డిగ్రీలుగా నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 31.1 డిగ్రీలుగా ఉంది. జిల్లాలో చలి తీవ్రతకు ఉదయం రాత్రి వేళల్లో జనం బయట తిరగడానికి ఇబ్బందులు పడుతున్నారు. వేకువ జామున పొగమంచుతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ రోజు 10 డిగ్రీల నుంచి 11 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఉదయం వేళల్లో పొగమంచు కమ్మేస్తోంది. పొగమంచు చలితో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో రైతులు ఇబ్బందులు పడుతూనే వ్యాపారాలు సాగిస్తున్నారు. చలి తీవ్రతకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉదయం రాత్రి వేళల్లో కాకుండా పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతున్నాయి. మరోవైపు చలి తీవ్రత నేపథ్యంలో అస్తమా, ఇతర శ్వాస కోసం వ్యాధులు ఉన్నవారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నావారు జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి జ్వరాలు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంటున్నారు.
Next Story