ఇంటర్ ఫలితాలపై ఆందోళన వద్దు
ఎగ్జామినర్ చేసిన పోరపాటు వల్లె ఫలితాల్లో లోపాలు తలెత్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు ఉదృతం చేయడంతో [more]
ఎగ్జామినర్ చేసిన పోరపాటు వల్లె ఫలితాల్లో లోపాలు తలెత్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు ఉదృతం చేయడంతో [more]
ఎగ్జామినర్ చేసిన పోరపాటు వల్లె ఫలితాల్లో లోపాలు తలెత్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు ఉదృతం చేయడంతో ఆయన దిగి వచ్చి జరిగిన తప్పులపై మీడియాతో మాట్లాడారు. ఓఎంఆర్ బబ్లింగ్ లో ఎగ్జామినర్ పొరపాట్లు చేశారని, అందుకే సమస్య వచ్చిందని పేర్కొన్నారు. కొన్నిచోట్ల సెంటర్ మారడం వల్ల కూడా సమస్యలు వచ్చాయన్నారు. తప్పు చేసిన వారి నుంచి వివరణ అడిగామని, వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ఆన్సర్ షీట్లు మాయమయ్యాయనే వార్తలు అవాస్తవమని, ఆన్సర్ షీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యార్థులు ఆందోళన చేందవద్దని, అనుమానం ఉన్నవారు రీకౌంటింగ్, రీవేరిఫికేషన్ చేయించుకోవచ్చని ప్రకటించారు.