Wed Dec 25 2024 04:13:11 GMT+0000 (Coordinated Universal Time)
కేబినెట్ మీట్ లో జగన్ హాట్ కామెంట్స్... మంత్రి వర్గ విస్తరణపై?
మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్ మంత్రులకు చెప్పినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్ మంత్రులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఇదే మాకు చివరి మంత్రి వర్గ సమావేశమా? అన్న కొందరి మంత్రుల ప్రశ్నకు జగన్ నుంచి చిరునవ్వు సమాధానం ఎదురయింది.
జిల్లాల బాధ్యతలు....
అయితే చాలా మంది ఆశావహులు ఉన్నారని, అందరికీ అవకాశం కల్పించాలని జగన్ మంత్రులతో చెప్పారు. ప్రస్తుత మంత్రులకు జిల్లా బాధ్యతలను అప్పగిస్తానని, తిరిగి గెలిపించుకుని వస్తే మీరే కదా? మంత్రులు అని జగన్ ప్రశ్నించారు. పార్టీ బాధ్యతలను ప్రస్తుతం ఉన్న మంత్రులే చూసుకోవాలని కేబినెట్ సమావేశంలో జగన్ చెప్పినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే అంటే వైసీపీ ప్లీనరీకి ముందే జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశాలున్నాయి.
Next Story