Mon Dec 23 2024 12:12:14 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల ఫిర్యాదుపై వేగంగా విచారణ
తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వై.ఎస్. జగన్ సోదరి షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ [more]
తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వై.ఎస్. జగన్ సోదరి షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ [more]
తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వై.ఎస్. జగన్ సోదరి షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సోషల్ మీడియాలో ఉన్న వీడియో, కామెంట్స్ కు సంబంధించిన యూఆర్ఎల్ పై సైబర్ క్రైం అదనపు డీసీపీ రఘువీర్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఫేస్ బుక్, యూట్యూబ్ సంస్థలకు ఈ మేరకు వివరాలు సమర్పించాల్సిందిగా పోలీసులు లేఖ రాశారు. ధర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. వీడియోలు తయారు చేసిన వాళ్లతో పాటు దాని వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఈ కేసును విచారిస్తున్న అదనపు డీసీపీ రఘువీర్ స్పష్టం చేశారు.
Next Story