Mon Dec 23 2024 15:49:24 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ..ఐపీఎల్ షెడ్యూల్ విడుదల
కెట్ అభిమానులు పండగా భావించే ఐపీఎల్ 2023 షెడ్యూల్ ను విడుదల చేశారు. మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది
బంతి.. బంతికి ఉత్కంఠ.. డెత్ ఓవర్లలో టెన్షన్... ఎవరిది గెలుపో ముందుగా ఊహించడం కష్టం. ఏ ప్లేయర్ చెలరేగి ఆడతాడో అంచనా వేయలేం. ఎన్ని బంతులు బౌండరీకి, ఎన్ని బాల్స్ స్టేడియంలోకి బుల్లెట్ లా దూసుకు వెళతాయో ఊహించడమూ అంత కష్టమే. క్రికెట్ అభిమానులు పండగా భావించే ఐపీఎల్ 2023 షెడ్యూల్ ను విడుదల చేశారు. మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. అదే రోజు తొలి మ్యాచ్ ప్రారంభం జరగనుంది.
తొలి మ్యాచ్...
తొలి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో చెననై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. గత ఏడాది విన్నర్ అయిన గుజరాత్ టైటాన్స్ ఈ ఏడాది కూడా కప్ ను కొట్టేందుకు సిద్ధమవుతుంది. క్రికెట్ లో థోని ఫ్యాన్స్ కు కొదవలేదు. క్రికెట్ నుంచి రిటైర్ అయినా ఐపీఎల్ లో మాత్రమే గ్రౌండ్ లో కన్పించే థోనిని చూసేందుకు అభిమానులు ఎగబడి పోతారు. పిచ్చెక్కి పోతారు. అలాంటి మ్యాచ్ తో మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం కానుంది.
ఫైనల్ మ్యాచ్...
మే 28న ఫైనల్ మ్యాచ్ జరగనుందని నిర్వాహకులు ప్రకటించారు. అంటే దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే పండగ. ప్రతి రోజూ మ్యాచ్. ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్ లు ఎన్నో. ఎవరు విజేత అని చెప్పడం కష్టం. బెట్టింగ్ లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్ లుంటాయని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 1న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
కుర్రోళ్లు సత్తా చాటడానికి...
కేవలం నాలుగు గంటల్లోనే ఫలితం తేలిపోతుంది. సాయంత్రం క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రతి రోజూ ఫీస్టే. ఒకటా రెండా... ఎన్ని రికార్డులు. వికెట్లు ఎగిరి ఎంత దూరం పడతాయో తెలీదు. ఈ ఐపీఎల్ ద్వారా అనేక మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐపీఎల్ లో చెలరేగి ఆడి సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. ఇక కుర్రాళ్లు రెచ్చిపోయి ఆడతారు. వారి లక్ష్యం ఒక్కటే. సిక్సర్లు బాదాలి. వికెట్లు తీయాలి. అదీ ఐపీఎల్.. ఇక రెడీ అయిపోండి. ఇక టీవీలకు అతుక్కుపోయే రోజు దగ్గరకు వచ్చేసింది. ఓకేనా?
Next Story