Mon Dec 23 2024 15:44:00 GMT+0000 (Coordinated Universal Time)
ఐపీఎల్ మెగా వేలం... 560 కోట్లతో?
ఐపీఎల్ మెగా వేలం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు బెంగళూరులో వేలం ప్రారంభించనున్నారు
ఐపీఎల్ మెగా వేలం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు బెంగళూరులో వేలం ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం పది ఫ్రాంచైజీలు ఈ వేలంలో పాల్గొననున్నాయి. ఇందుకోసం 590 ఆటగాళ్లను వేలంలో ఫ్రాంఛైజీలను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం దాదాపు 560 కోట్లను వెచ్చించనున్నాయి. ఒక్కొక్క జట్టు ఇరవై ఐదు ఆటగాళ్లను కలిగి ఉండాల్సి రావడంతో ఈరోజు వేలంలో యువ క్రికెటర్లకు భారీగా పారితోషకం లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
యువ ఆటగాళ్లను....
ఇందులో భారత యువ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఈ వేలంలో కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పాల్గొననుండటంతో మొత్తం జట్లు పదికి చేరాయి. ఈ వేలంలో కుర్రోళ్లకు అధిక రేటు పలికే అవకాశాలున్నాయని క్రీడా పండితులు చెబుతున్నారు. ఇటీవల అండర్ 19 లో సత్తా చూపిన యువ ఆటగాళ్లకు కూడా ధర ఎక్కువ పలుకుతుందని చెబుతున్నారు. గుంటూరు జిల్లా కు చెందిన రషీద్ కు మంచి అవకాశాలున్నాయని మాజీ క్రిెకెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెబుతున్నారు.
ట్రాక్ రికార్డు..
దీంతో పాటు ప్రస్తుతం వెస్టిండీస్ లో బౌలర్ గా, బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్న స్మిత్ కు కూడా ఎక్కువ ధర పలుకుతుందంటున్నారు. భారత్ తో జరిగిన మూడు మ్యాచ్ లలో ఇటు బౌలర్ గా, బ్యాట్స్ మెన్ గా స్మిత్ రాణించారు. సిక్సర్లు బాదడంతో స్మిత్ కు ఎక్కువ ధర పలికే ఛాన్స్ ఉందంటున్నారు. ట్రాక్ రికార్డును చూసి జట్లు భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయడానికైనా సిద్ధపడతాయి. మొత్తం మీద మరికాసేపట్లో జరగనున్న ఐపీఎల్ వేలంలో యువ ఆటగాళ్లు ఎన్ని కోట్లు కొల్లగొడతారన్నది తేలిపోనుంది.
Next Story