బ్రేకింగ్ : అరకు సంఘటన... ఆ ఎస్పీపై బదిలీ వేటు...!
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివారి సోమలను మావోయిస్టులు హత్య చేసిన సంఘటనలో విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మపై బదిలీ వేటు పడింది. ఆయనను విశాఖ సిట్ కు బదిలీ చేశారు. ఏపీలో 14 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగాయి. కడప ఎస్పీ బాబూజీ అట్టాడకు విశాఖ రూరల్ ఎస్పీగా బదిలీ చేశారు. చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబుకు గుంటూరు రూరల్ ఎస్పీగా బదిలీ జరిగింది. విశాఖ రూరల్ అడిషినల్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగికి నెల్లూరు ఎస్పీగా బదిలీ అయ్యారు.విశాఖ లా అండ్ ఆర్డర్ డిసిపి ఫకీరప్పకు కర్నూల్ ఎస్పీగా బదిలీ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతికి కడపకు , పార్వతీపురం ఓఎస్డీ విక్రాంతి పాటిల్‌ను చిత్తూరుకు బదిలీ చేశారు. చిత్తూరు ఓఎస్డీ అన్బురాజన్‌కు తిరుపతి అర్బన్ ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ విశాఖ సిట్‌కు బదిలీ అయ్యారు. గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు విజయవాడ లా అండ్ ఆర్డర్ కు బదిలీ అయ్యారు. నెల్లూరు ఎస్పీ పిహెచ్డి రామకృష్ణకు సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ బ్యూరో బాధ్యతలను అప్పగించారు. కడప అడిషనల్ ఎస్పీ అద్మాన్ నయీం అస్మీకు విశాఖ లా అండ్ ఆర్డర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యారు. కర్నూలుఎస్పీ గోపినాథ్ జెట్టికి టిటిడి సెక్యూరిటీ., విజిలెన్స్ బాధ్యతలను అప్పగించారు. నర్సీపట్నం ఓఎస్డీ సిద్ధార్ధ కౌశల్‌కు గుంతకల్ రైల్వే ఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న రవీంద్రనాధ్ బాబుకు విశాఖ లా అండ్ ఆర్డర్ బాధ్యతలను అప్పగించారు.