భారీ విధ్వంసానికి ఐసిస్ కుట్ర.. భగ్నం చేసిన ఎన్ఐఏ
దేశంలో భారీ విధ్వంసానికి ఐసిస్ పన్నిన కుట్రను ఎన్ఐఏ చేదించింది. పక్కా సమాచారంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తో పాటు పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ ఏకకాలంలో సోదాలు జరిపింది. [more]
దేశంలో భారీ విధ్వంసానికి ఐసిస్ పన్నిన కుట్రను ఎన్ఐఏ చేదించింది. పక్కా సమాచారంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తో పాటు పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ ఏకకాలంలో సోదాలు జరిపింది. [more]
దేశంలో భారీ విధ్వంసానికి ఐసిస్ పన్నిన కుట్రను ఎన్ఐఏ చేదించింది. పక్కా సమాచారంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తో పాటు పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ ఏకకాలంలో సోదాలు జరిపింది. ఐసిస్ తో సంబంధాలు ఉన్న 10 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అయితే, ఐసిస్ దేశంలో పెద్దఎత్తున విధ్వంసానికి కుట్ర చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించింది. దేశంలోని ముఖ్యపట్టణాల్లో ఏకకాలంలో పేలుళ్లు జరపాలని ఐసిస్ కుట్ర పన్నింది. ఇందుకోసం 100 గడియారాలు, 20 కిలోల ఐఈడీని కూడా సిద్ధం చేసుకున్నారు. వీటితో పాటు రాకెట్ లాంఛర్లు, పిస్టోళ్లను కూడా ఎన్ఐఏ వీరి వద్ద నుంచి స్వాదీనం చేసుకుంది. పలువురు ఆరెస్సెస్ నేతలను సైతం వీరు టార్గెట్ చేశారు. ఇప్పటికే ఆరెస్సెస్ కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించినట్లు తేలింది.