Sun Dec 22 2024 20:21:27 GMT+0000 (Coordinated Universal Time)
వెంటాడి… వేటాడి చంపుతాం
కాబూల్ లో ఐసిస్ తీవ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కాబూల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఆరు చోట్ల బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 13 మంది అమెరికా [more]
కాబూల్ లో ఐసిస్ తీవ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కాబూల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఆరు చోట్ల బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 13 మంది అమెరికా [more]
కాబూల్ లో ఐసిస్ తీవ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కాబూల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఆరు చోట్ల బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐసిస్ తీవ్రవాదులు ప్రకటించుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం 70 మందికి పైగా మృతి చెందారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరించారు. వేటాడి, వెంటాడి చంపుతామని జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. తమ దళాలు మాత్రం ఈ నెల 31వ తేదీన వెనక్కు తిరిగి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
Next Story