Tue Dec 24 2024 01:08:04 GMT+0000 (Coordinated Universal Time)
ఇదే పర్ఫెక్ట్ టైం... జగన్ నడుం బిగిస్తే?
రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ స్టాండ్ ఎటువైపు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది
రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఈసారి విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. మమత బెనర్జీ సారధ్యంలో విపక్షాలన్నీ ఏకమై మరో అభ్యర్థిని పోటీ చేయించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ తో కలుపుకుని మిగిలిన బీజేపీయేతర పక్షాలను కలుపుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపాలని సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ స్టాండ్ ఎటువైపు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఓట్లు అవసరం....
ఎన్టీఏ కూటమికి 1.2 శాతం ఓట్లు అవసరం అవుతుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే రాష్ట్ర ప్రయోజనాలను సాధించడానికి ఇదే సమయమని విశ్లేషకులు సయితం చెబుతున్నారు. అటు మమత, ఇటు కేసీఆర్ బీజేపీకి తలనొప్పిగా తయారయ్యారు. బీజేపీ రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని భావిస్తుంది. ఇందుకోసం అన్ని పక్షాలను సంప్రదించేందుకు జేపీ నడ్డాతో పాటు రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ ను నియమించారు. వీరింకా సంప్రదింపులు ప్రారంభించలేదు.
రాష్ట్ర ప్రయోజనాలు...
జగన్ ఈసారి కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బీజేపీ ఏకపక్ష:గా రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవు. 1.2 శాతం ఓట్లు అవసరం ఉంది. ఇతర పక్షాలు ఏవీ బీజేపీ వైపు చూడటం లేదు. ఈ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం నుంచి పరిష్కరించుకోవడానికి సరైన సమయమని సూచనలు వినపడుతున్నాయి.
తలొగ్గే అవకాశాలు....
ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలసి వచ్చారు. అయితే విపక్షాలు మాత్రం సొంత కేసుల కేసుల కోసమే కలసి వచ్చారన్న విమర్శలు చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికలను రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఇదే సరైన సమయమని, ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం తలొగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరి ఈ సమయాన్ని జగన్ వినియోగించుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story