Tue Jan 14 2025 12:48:14 GMT+0000 (Coordinated Universal Time)
సిట్ నోటీసులకు జగన్ సమాధానం
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నం కేసులో సిట్ ఇచ్చిన నోటీసుకు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ ఘటనపై జగన్ స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి సిట్ జగన్ కు ఈ నోటీసులు ఇచ్చింది. అయితే, ఈ ఘటనపై తన రిట్ పిటీషన్ కోర్టు విచారణలో ఉందని, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్పందిస్తానని జగన్ స్పష్టం చేశారు. తనపై హత్యాయత్నం ఘటనలో సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదని జగన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
Next Story