జగన్ సర్వేలను నమ్మడం లేదా..?
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూణ్నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన సర్వేలన్నీ అధికార పార్టీయే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని స్పష్టం చేస్తున్నాయి,. టైమ్స్ నౌ, ఈటీజీ సంస్థలు ఈ మధ్య జరిపిన సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది. ఇంతవరకూ ఏ పార్టీకి లేనంత విశ్వాసంతో జగన్ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతోంది. జగన్ కూడా గెలుపు అనే మాట పక్కన బెట్టి, వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు.

సర్వేలన్నీ జగన్ బంపర్ మెజార్టీతో గెలుస్తారని చెబుతుంటే, 40 స్థానాల్లో ఎమ్యెల్యేలను మార్చాల్సిన అవసరం ఏముంది అనేదే అసలు ప్రశ్న. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జిలను ప్రకటించారు. వారిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరు. తన సీటు కిందకు నీళ్లు వస్తున్నాయని తెలిసే ఆయన మంగళగిరి నుంచి తప్పుకున్నారు. ఎమ్మెల్యే పదవితో పాటు వైకాపా సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం సంచలనం కలిగించింది.
సర్వేల దారి సర్వేలదే... తన దారి తనదే అన్నట్లుంది జగన్ వ్యవహార శైలి. సర్వేలు, పేపర్లను ఆయన నమ్మరు. తనకంటూ ఓ నెట్వర్క్ ఉంటుంది. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద కూడా ఆయన ఆధారపడరు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సారధ్యంలోని ఐప్యాక్... జగన్‌కు చేదోడు వాదోడుగా నిలిచింది. 2019లో వైకాపా ఎన్ని నియోజకవర్గాల్లో గెలవబోతోందో ఖచ్చితమైన సమాచారం జగన్ దగ్గర ఉంది.
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్ టీమ్‌లో లేరు. అయినా జగన్ భయపడటం లేదు. సర్వేలన్నీ ఫ్యాన్ గుర్తుదే అధికారం అని చెబుతున్నాయి. అందుకని జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో లేరు. తన వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ప్రజల్లో మంచి అభిప్రాయం లేని ప్రస్తుత ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు. ఆయా అభ్యర్థులకు ముందుగానే హింట్ ఇస్తున్నారు. ‘సామాజిక వర్గం’ అనే స్ట్రాటజీతో ప్రత్యర్థులను గట్టిగా కొడుతున్నారు. మంగళగిరిలో ‘బీసీ’ నినాదం ఇలాంటిదే.175 స్థానాల్లోనూ గెలవడం సాధ్యం కాదని ఆయనకూ తెలుసు. కానీ ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బ కొట్టాలనే లక్ష్యంతోనే ఆయన పావులు ముందుకు కదుపుతున్నారు. సర్వేల కంటే ఆయన సొంత బలం మీదే ఆధారపడుతున్నారు. అది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోందో చూడాలి.