బ్రేకింగ్ : జగన్ సర్కార్ కు షాక్
హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. విజెలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయాలను కర్నూలు కు ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పిటిషన్లు పెండింగ్ [more]
హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. విజెలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయాలను కర్నూలు కు ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పిటిషన్లు పెండింగ్ [more]
హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. విజెలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయాలను కర్నూలు కు ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పిటిషన్లు పెండింగ్ లో ఉండగా ఎలా తరలిస్తారని హైకోర్టు నిలదీసింది. దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇక్కడ ఆ కార్యాలయ నిర్వహణ కష్టంగా మారిందని, ఇబ్బందులున్నందునే తరలించామని ప్రభుత్వం తరుపున న్యాయవాది స్పష్టం చేశారు. నిర్వహణ ఇబ్బందులుంటే ఇక్కడే స్థలంలో భవనాన్ని నిర్మించ వచ్చు కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 26వ తేదీ వరకూ ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.