Wed Dec 25 2024 04:43:59 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ లెక్కలు వేరుగా ఉన్నాయట
జగన్ ను దగ్గర నుంచి చూసిన వారు ఎవరూ ఆయనకు చిరాకు తెప్పింరు. చికాకు తెప్పిస్తే వారిపట్ల కఠినంగా జగన్ వ్యవహరిస్తారు.
జగన్ ను దగ్గర నుంచి చూసిన వారు ఎవరూ ఆయనకు చిరాకు తెప్పించే పని చేయరు. చికాకు తెప్పిస్తే వారిపట్ల మరింత కఠినంగా జగన్ వ్యవహరిస్తారు. జగన్ తొలి నుంచి అంతే. తనను నమ్ముకున్న వారికి వెంటనే ఉపయోగపడతారు. అలాగే తనను వదిలేసిన వారిని దగ్గరకు చేర్చుకోవడానికి ఇష్టపడరు. జగన్ తొలి నుంచి అలాగే వ్యవహరిస్తున్నారు. తనకు నచ్చకపోతే పార్టీ నుంచి సీనియర్ నేతలనయినా పంపించేందుకు వెనుకాడ లేదు.
ఇష్టపడకపోతే....?
మైసూరా రెడ్డి నుంచి సబ్బం హరి, కొణతాల రామకృష్ణ వరకూ సీనియర్ నేతలు, తన తండ్రి వైఎస్ కు అత్యంత సన్నిహితులైనప్పటికీ వారిని చెంత ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. అదే సమయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి వారిని వెంట పెట్టుకుని ఉన్నారు. జగన్ కు కావాల్సింది తల ఎగరేయకుండా ఉండటమే. పార్టీ పట్ల విశ్వాసంగా వ్యవహరించడమే. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ పోస్టులను భర్తీ చేశారు. నచ్చని వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. జగన్ లెక్కలు జగన్ కు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారమే ఆయన పదవులు పంపిిణీ చేస్తారు.
మంత్రి వర్గ విస్తరణలోనూ?
మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందన్నది తెలియదు. వచ్చే జనవరికి జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపడతారంటున్నారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్సీ పోస్టులు లాగానే ఊహించని వారికి మంత్రి పదవులు దక్కుతాయన్న ప్రచారం వైసీపీలో జరుగుతుంది. రెడ్డి సామాజికవర్గంతో పాటు మరికొందరు సీనియర్ నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ ఊపు చూస్తుంటే సీనియర్లను కూడా పక్కన పెట్టేటట్లే కనిపిస్తుంది.
సీనియర్లకు షాక్ తప్పదట....
వచ్చే ఎన్నికలకు పార్టీకి అన్ని రకాలుగా ఉపయోగపడే వారినే వచ్చే కేబినెట్ లో ఎంపిక చేయనున్నారు. ప్రధానంగా యువకులకు రానున్న విస్తరణలో అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో అసంతృప్తులు తలెత్తినా జగన్ కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా జగన్ కసరత్తులు చేస్తున్నారు. ఈసారి సీనియర్లకు పార్టీ బాధ్యతలను అప్పగించి మంత్రివర్గంలోకి కొత్త వారిని ఎంపిక చేసే దిశగా జగన్ ఆలోచనలు ఉన్నట్లు చెబుతున్నారు.
Next Story