జగన్.. ముసలిపులి.. నరమాసం కథ
రిపబ్లిక్ టీవీలో ముసలాయన వచ్చీ రాని భాషలో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు తనకు పంచతంత్రం కథ గుర్తుకు వచ్చిందని జగన్ అన్నారు
రిపబ్లిక్ టీవీలో ముసలాయన వచ్చీ రాని భాషలో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు తనకు పంచతంత్రం కథ గుర్తుకు వచ్చిందని జగన్ అన్నారు. "అనగనగా ఒక పులి ఉండేదట. ఆ పులి మనిషి మాంసం రెగ్యులర్గా తినేది. సంవత్సరాలుగా నరమాంసం తినే పులి ముసల్ది అయిపోయింది. వయసు అయిపోయిన తర్వాత వేటాడే శక్తి లేక, పరుగెత్తే ఓపిక లేని ఆ పులి ఉన్న చోటే కూర్చుని నాలుగు నక్కలను కలుపుకుని మనుషులను ఎలా తినాలి అని ప్లాన్ చేసింది. ఆ మనుషులను చంపేసిందాంట్లోనుంచి బంగారు కడియాలను దోచుకున్న దొంగలను కాలిబాట పోతున్న మనుషులకు వాటిని చూపించడం మొదలు పెట్టింది. తమ్ముళ్లూ కడియం కావాలంటే నీటిలో మునగాలి అని చెప్పేది. కాకుంటే మనుషులు పులిని చూసి నమ్మని వాళ్లకు తాను మంచిదాన్ని అయిపోయానని, కృష్ణా.. రామా అంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్నామని నమ్మించింది. దీంతో పులి మాటను నమ్మిన వాళ్లు మడుగులో స్నానానికి వెళ్లేవారు. ఆ బురదలో ఇరుక్కునే వారు. వారిన పులి తినేసేది" ఈ కధ ఉంటే చంద్రబాబు గుర్తుకు రాడా? అని జగన్ ప్రశ్నించారు.