Thu Jan 16 2025 00:56:12 GMT+0000 (Coordinated Universal Time)
హత్యాయత్నం తర్వాత మొదటిసారి మాట్లాడిన జగన్
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో తనపై హత్యాయత్నం ఘటన తర్వాత 17 రోజుల విశ్రాంతి తీసుకుని ప్రతిపక్ష నేత ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర పున:ప్రారంభం అయ్యింది. పాపయ్యవలసలో రాజమండ్రికి చెందిన బీసీ సంఘం నేతలు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ వేదికపై మాట్లాడారు. వైసీపీలో చేరిన వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అయితే, హత్యాయత్నం సంఘటనపై మాత్రం ఆయన మాట్లాడలేదు. బహిరంగసభలోనే జగన్ ఆ ఘటనపై మాట్లాడే అవకాశం ఉంది.
Next Story