Thu Dec 26 2024 14:34:43 GMT+0000 (Coordinated Universal Time)
ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ విజయం
ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ విజయం సాధించారు.
ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ విజయం సాధించారు. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖర్ పూర్తిస్థాయిలో విజయం సాధించారు. జగదీప్ ధన్ఖర్ కు 528 ఓట్లు వచ్చాయి. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు 182 ఓట్లు వచ్చాయి. పార్లమెంటు సభ్యుల్లో అత్యధిక శాతం మంది జగదీప్ ధన్ఖర్ కు ఓట్లు వేసి గెలిపించారు. 346 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు.
అభినందనల వెల్లువ...
జగదీప్ ధన్ఖర్ విజయం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు అభినందనలను తెలిపారు. ఆయన కు దేశంలోని పలు ప్రాంతాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story