Mon Nov 25 2024 21:48:41 GMT+0000 (Coordinated Universal Time)
జగ్గారెడ్డిపై ఏఏ సెక్షన్లంటే....?
2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఎనిమిది సెక్షన్ల కింద కేసులు పెట్టారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో 3 గంటలు పాటు జగ్గారెడ్డిని విచారించిన పోలీసులు అరెస్ట్ చూపారు. గుజరాత్ కి చెందిన ముగ్గురుని తన కుటుంబ సభ్యులుగా చేర్చి అమెరికాకి తరలించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. గాంధీ ఆస్పత్రిలో జగ్గారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో సికింద్రాబాద్ కోర్టులో జగ్గారెడ్డిని పోలీసులు హాజరుపర్చనున్నారు.
Next Story