Wed Nov 27 2024 15:36:17 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు తగ్గుతారా? లేదా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లు టీడీపీలో కలవరం రేపుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లు టీడీపీలో కలవరం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిని జనసేన కోరుకుంటుండటం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. అనుభవజ్ఞుడైన చంద్రబాబును కాదని, పవన్ ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికలకు వెళితే ప్రజలు తిరస్కరించే అవకాశముందని ఇప్పటికే టీడీపీ శ్రేణులు ప్రచారాన్ని ప్రారంభించాయి. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న తమ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఎలా వదులుకుంటుందన్న ప్రశ్నను నెట్టింట్లో వాళ్లు జనసైనికులకు సంధిస్తున్నారు.
ఓడినా, గెలిచినా....
వచ్చే ఎన్నికల్లో ఓడినా, గెలిచినా పవన్ కల్యాణ్ కు పోయేదేమీ లేదు. ఆయనకు వయసు ఉంది. రాజకీయ భవిష్యత్ ఉందా? లేదా? అన్నది కూడా పవన్ పెద్దగా ఆలోచించరు. పవన్ రాజకీయాల్లోకి వస్తూనే 25 ఏళ్ల పాటు తాను రాజకీయం చేయాలని వచ్చానని చెప్పారు. సో... పవన్ కు వచ్చే ఎన్నికల్లో ఓడినా, గెలిచినా పెద్దగా ఫరక్ పడదు. ఆయన నింపాదిగా రాజకీయం చేసుకుంటున్నారు. సమయం దొరికినప్పుడు రాజకీయానికి కేటాయిస్తున్నారు.
టీడపీ పరిస్థిితి...
చంద్రబాబు పరిస్థితి అలాంటిది కాదు. వచ్చే ఎన్నికలు పార్టీ భవిష్యత్ ను నిర్ణయిస్తాయి. వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలయితే టీడీపీ మనుగడ కష్టంగా మారుతుంది. మరోసారి వైసీీపీ అధికారంలోకి వస్తే జగన్ అసలు తగ్గడు. ఇప్పుడే మూడేళ్ల పాటు నేతలు బయటకు రాకుండా ముడుచుకూర్చున్నారు. కేసులకు భయపడో, డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేకనో తెలీదు కానీ ఇప్పుడిప్పడే మూడేళ్ల తర్వాత సీనియర్ నేతలు సయితం బయటకు వస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు.
ఈసారి ఓటమి పాలయితే...?
అలాంటిది ఈసారి ఓటమి పాలయితే పార్టీకి పుట్టగతులుండవ్ అన్న సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. లోకేష్ నాయకత్వంపై ఇప్పటికీ ఎవరికీ నమ్మకం లేదు. పైకి చినబాబుకు గౌరవమర్యాదలు ఇస్తున్నా, మరోసారి ఓటమి పాలయితే ఆ మొహాన్ని చూసేందుకు కూడా ఇష్టపడరు. అందుకే పవన్ కల్యాణ్ గట్టిగా నొక్కుతున్నారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు టీడీపీ అవసరం కన్నా, టీడీపీకే జనసేన అవసరం ఉందన్నది కాదనలేని వాస్తవం. అందుకే చంద్రబాబు చివరి నిమిషంలోనైనా తగ్గుతారని, పొత్తులతోనే ఎన్నికలకు వెళతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మరి చంద్రబాబు సీఎం పదవిని త్యాగం చేస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story