Mon Dec 23 2024 08:00:46 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి గౌతమ్ రెడ్డికి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ నివాళి
జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు..
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి.. పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మంత్రి గౌతమ్ రెడ్డి ఇక లేరన్న విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదన్నారు. ఆయన హఠాన్మరణం తనను చాలా బాధించిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. విద్యావంతుడైన గౌతమ్ రెడ్డి.. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న మంచి సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆయన లేని లోటు కుటుంబ సభ్యులకు, రాష్ట్రానికీ తీరని లోటని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
News Summary - Janasena Chief Pawan kalyan and Nadendla Manohar paid Tribute to Minister goutam Reddy
Next Story