Fri Dec 20 2024 01:39:55 GMT+0000 (Coordinated Universal Time)
నాదెండ్లను అంటే ఊరుకోను సస్పెండ్ చేసి పారేస్తా
జనసేన బలం పెరిగిందని, దానిని ఎన్నికల్లో చూపిద్దామని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు
జనసేన బలం పెరిగిందని, దానిని ఎన్నికల్లో చూపిద్దామని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ నాయకులతో ఆయన మాట్లాడారు. జనసేన అభ్యర్థులను గెలిపించుకుని, వైసీపీ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిద్దామని తెలిపారు. నాదెండ్ల మనోహర్ ని కులం పేరుతో జనసేన నాయకులే విమర్శిస్తున్నారని, అతన్ని టార్గెట్ చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పదిహను నిమిషాల సమయం ఇస్తే మా ప్రతాపం చూపిస్తామన్న ఎంఐఎంకు 7 స్థానాలు వచ్చాయని, ఎంఐఎంలా కాదు.. కనీసం విజయకాంత్ లా కూడా మనల్ని గెలిపించలేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఫిర్యాదులు చేయడానికి రావొద్దు...
నాయకులు తన వద్దకు పిర్యాదులు చేయడానికి రావద్దని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రావాలని పవన్ పిలుపు నిచ్చారు. తనను తిట్టలేక కొందరు నాదెండ్ల మనోహర్ తిడుతున్నారని, ఆయనపై తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అభిమానం ఓట్లుగా మారితేనే ముఖ్యమంత్రి అవుతారని, అజాత శత్రువును కాను.. కొంత మందికి నన్ను శత్రువుగా చూసినా ఓకే.. తనను ఎంత విమర్శిస్తే.. అంతగా రాటుతేలుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. గత ఎన్నికల్లో 30-40 సీట్లు వచ్చుంటే ఇప్పుడు సీఎం సీటు వచ్చే తీరాలని అన్నారు. కానీ సీట్లు లేవప్పుడు ఏం చేయగలం..? ఓ ప్రాంతానికే పరిమితం అయిన ఎంఐఎంకు ఏడు స్థానాలు వచ్చాయని, కానీ జనసేనకు కనీసం 10 స్థానాలైనా రాకుంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు.
దీర్ఘకాలం పనిచేసే వారు....
నాదెండ్ల మనోహర్ తన వెనుక బలంగా నిలబడ్డారని, ఆయనపై ఎంతో మంది విమర్శలు చేసినా సరే ఆయన ఒక్క మాట మాట్లాడకుండా నిలబడ్డారని పవన్ అన్నారు. ఆయనపై ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా సరే నేను వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తానని పవన్ పునరుద్ఘాటించారు. జనసేనలో దీర్ఘకాలం పనిచేసేవారు కావాలని, కాలక్షేపం చేసేవారు వద్దని, వారికి పదవులు ఇవ్వమని తేల్చిచెప్పారు. పొత్తులపై పూర్తిస్థాయి చర్చలు ఉన్నరోజు, మీడియా ముందు కూర్చొని విధివిధానాలు ప్రకటించి అప్పుడు పొత్తుతో ముందుకు వెళతామని తెలిపారు. అంతేగానీ నాలుగు గోడల మధ్య ఒప్పందాలు చేయనకని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి పదవి...
తనకుకు పోగొట్టుకోవడానికి ఏమి లేదని, అవమాన పడ్డానని, ఓడిపోయానని, తిట్టించుకున్నానని అయినా నిలబడ్డానని పవన్ తెలిపారు. సముచిత స్థానాల్లో గెలిపించండి, ముఖ్యమంత్రి పదవి గురించి అప్పుడు మాట్లాడదామని పవన్ అన్నారు. జనసేన - టీడీపీ - బీజేపీ అలయెన్స్ తో ఎన్నికలకు వెళుతున్నామని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికల తరవాత మాట్లాడదామని తెలిపారు. కష్టాల్లో ఉన్నప్పుడే పవన్ కల్యాణ్ గుర్తోస్తాడేమో..? మోసం చేసే వాళ్లే జనానికి నచ్చుతారేమో..? అయినా నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం.. ఈ రాష్ట్రం కోసం తాను నిలబడతానని పవన్ కల్యాణ్ చెప్పారు.
టీడీపీ నేతలను సీఎం చేసేందుకు...
టీడీపీ నేతలను సీఎం చేసేందుకు జనసేన లేదని, మన బలాన్ని మనం బేరీజు వేసుకోవాలని, అవసరమైనప్పుడు తగ్గడమే కాదు, బెబ్బులిలా తిరగబడాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో సకల కళా కోవిదులకు ఒకటే చెబుతున్నా, తనను తిట్టడానికి మీ పార్టీలో బుడతలు బయటకు వస్తారు కదా, దమ్ముంటే వారిలోంచి ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి చూద్దామని సవాల్ విసిరారు. పెళ్లిళ్ల విషయంలో కులం పాటించని చాలామంది కాపు నాయకులు రాజకీయంగా మాత్రం కులం ప్రస్తావన తెస్తారని, కులాన్ని వదులుకోమని చెప్పట్లేదని, కులాలను కలుపుకుని పనిచేయమంటున్నానని ఆయన అన్నారు.
అప్పుడు ఎందుకు?
ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు జాతీయ పార్టీ బీఆర్ఎస్ కూడా పొత్తుల ద్వారా నిలబడిన పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు. ఒకప్పుడు జనసేనతో కూడా పొత్తులకు సిద్ధపడ్డారన్న విషయాన్ని తెలుసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో ఓట్లు వేసి ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడినని, ఓట్లు వేయండి అప్పుడు మాట్లాడుదామని చెప్పారు. సలహా ఇచ్చే కొంతమంది కాపు నాయకులను అడుగుతున్నానని, 2019లో నేను బయటకు వచ్చి పోటీ చేశాను ఎందుకు నిలబడలేదని పవన్ ప్రశ్నించారు. దాదాపు 60శాతం కాపులు వైసిపి కి ఓట్లు వేశారని, అప్పుడేం చేశాదని నిలదీశారు. రిజర్వేషన్లు ఇవ్వనన్న జగన్ నీ నమ్మారు కాని, తనను ఎందుకు నమ్మలేదని ఆయన ప్రశ్నించారు.
Next Story