ఏపీలో పవన్ వాటా పది సీట్లేనా..!
తెలంగాణలో భాజపాతో పొత్తు పెట్టుకుని ఎనిమిది సీట్లలో పోటీ చేసిన జనసేన కథ... కంచికి చేరింది. ఆ పార్టీకి చెందిన ఏ అభ్యర్థికీ డిపాజిట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. పవన్ నాన్ సీరియస్ పాలిటిక్స్ తెలంగాణ జనానికి నచ్చలేదు. ఏపీలో, వచ్చే ఎన్నికల్లో... ఈ ప్రభావం క్లియర్గా కనిపిస్తుంది.
తెలంగాణలో నేల కరిచిన జనసేన

జగన్ను ద్వేషిస్తూ, వైకాపాను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ తెలంగాణలో పోటీ చేసి పరువు పోగొట్టుకున్నారు. తెలంగాణ ప్రచారంలో కూడా వైకాపానే తిట్టి, అధికారంలో ఉన్న భారాస నేతల్ని ఒక్క మాట కూడా ఆయన అనలేకపోయారు. అందుకే ఆ పార్టీని తెలంగాణవాసులు లైట్ తీసుకున్నారు.
జనసేనాని వైఖరితో ఆంధ్రలో ఆ పార్టీ ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఏర్పాటు చేసి, వైకాపాను గద్దె దింపాలని పవన్ కలలు కంటున్నారు. చంద్రబాబును జైల్లో కలిసిన తర్వాత.. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ ఏకపక్షంగా ప్రకటించారు. ఇది కేంద్రస్థాయిలో భాజపా నేతలకు రుచించలేదు. ఏపీలో కొందరు తెలుగుదేశం నేతలకు కూడా ఇది నచ్చలేదు. పొత్తులో భాగంగా తమ స్థానాలను కోల్పోతామని వాళ్ల భయం. తెలంగాణలో జనసేన పెర్పార్మెన్స్ చూసిన తర్వాత... ఎక్కువ సీట్ల విషయంలో బేరమాడే స్థాయిలో పవన్ ఇప్పుడు లేరు.
పొత్తులో భాగంగా తమకు యాభై నుంచి అరవై సీట్లు కావాలని జనసైనికులు భావించారు. పవన్ కూడా ఆ దిశగానే బేరమాడదామని అనుకున్నారు. అప్పట్లో తెలుగుదేశం 20 నుంచి 25 సీట్ల వరకే జనసేనకు కేటాయిద్దామని అనుకున్నట్లు సమాచారం. తెలంగాణలో జనసేన కుదేలైపోవడంతో, చంద్రబాబు తమ బేరం పది సీట్ల నుంచి ప్రారంభించనున్నారు. తెలంగాణలో కాలు పెట్టి, ఇక్కడ అవకాశాల్ని పోగొట్టుకుని, రెంటికీ రెడ్డ రేవడిలా మిగిలారు పవర్ స్టార్.