ఈసారి బలిపశువును కాను.. ప్రయోగాలు చేయను
ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేస్తానని జసేనన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు
తనకు సంపూర్ణ నమ్మకం వస్తేనే పొత్తులు కుదురుతాయని జసేనన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో నివేదికలు ఖచ్చితంగా జనసేన గెలుస్తుందని వస్తే ఒంటరిగానే ఎన్నికలకు వెళతామని పవన్ తెలిపారు. ఈ దేశానికి నరేంద్ర మోదీ అవసరమని భావించానని అన్నారు. ప్రత్యేక హోదాకోసం తాను నిలబడి బీజేపీని దూరం చేసుకుంటే అది వైసీపీకి దగ్గరయిందన్నారు. ప్రత్యేక హోదా కోసం తాను పట్టుబడితే అందరూ తనను ఒంటరిని చేశారన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రెండు పార్టీలు కలసి పనిచేసుంటే ఇప్పటికే టీడీపీ కంటే బలపడేవాళ్లమన్నారు. తెలుగుదేశం మీద తనకు ప్రత్యేక ప్రేమ లేదన్నారు. చంద్రబాబు అంటే గౌరవమేనని అన్నారు. తెలుగుదేశం పార్టీతో తాను ఇప్పటి వరకూ పొత్తుల విషయమే చర్చించలేదన్నారు. ఈసారి ఎన్నికలకు జనసేన బలిపశువు కాదని, ప్రయోగాలు చేయబోనని, అసెంబ్లీలోకి ఖచ్చితంగా అడుగుపెడతామని తెలిపారు. తనతో పాటు పోటీ చేసిన వాళ్లంతా అసెంబ్లీలోకి వెళ్లాల్సిందేనన్నారు. మీరు ఏం జరిగితే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందన్నారు. ఓటును వృధాను కానివ్వమని అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనది బలమైన సంతకం ఉంటుందని అన్నారు.