Mon Dec 23 2024 19:57:03 GMT+0000 (Coordinated Universal Time)
చేయాలి కాబట్టి చేస్తున్నాం… జరిగేదేం లేదు
తాము ఎన్ని ఆందోళనలు చేసినా నిరసనలు చేసినా నరేంద్ర మోదీ మారరని, కాకపోతే చేయాలి కాబట్టి నిరసనలు చేస్తున్నామని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. [more]
తాము ఎన్ని ఆందోళనలు చేసినా నిరసనలు చేసినా నరేంద్ర మోదీ మారరని, కాకపోతే చేయాలి కాబట్టి నిరసనలు చేస్తున్నామని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. [more]
తాము ఎన్ని ఆందోళనలు చేసినా నిరసనలు చేసినా నరేంద్ర మోదీ మారరని, కాకపోతే చేయాలి కాబట్టి నిరసనలు చేస్తున్నామని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. తమ నిరసనలతో ఏదో జరుగుతుందనే ఆశ కూడా తనకు లేదన్నారు. శుక్రవారం టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ… నరేంద్ర మోదీ మూర్ఖత్వం శృతి మించిదని, ఇటువంటి నిరసనలకు ఆయన లొంగరని అన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో దెబ్బ పడితేనే ఆయన మారతారని, గాంధీ మార్గం ఆయనకు పనికిరాదన్నారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రజలు ఆయనకు బుద్ధచెబితేనే మోదీ మారతారన్నారు.
Next Story