Sat Dec 28 2024 11:22:21 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మోడీని వద్దకు సింధియా.. ఇక కమల్ నాధ్ కు కష్టాలే
ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కలిశారు. అమిత్ షాతో కలసి మోడీ వద్దకు వచ్చిన సింధియా ప్రధానితో చర్చలు జరిపారు. దీంతో మధ్యప్రదేశ్ లోని [more]
ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కలిశారు. అమిత్ షాతో కలసి మోడీ వద్దకు వచ్చిన సింధియా ప్రధానితో చర్చలు జరిపారు. దీంతో మధ్యప్రదేశ్ లోని [more]
ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కలిశారు. అమిత్ షాతో కలసి మోడీ వద్దకు వచ్చిన సింధియా ప్రధానితో చర్చలు జరిపారు. దీంతో మధ్యప్రదేశ్ లోని కమల్ నాధ్ సర్కార్ సంక్షోభంలో పడినట్లయింది. గత కొంతకాలం నుంచి జ్యోతిరాదిత్య సింధియా, కమల్ నాధ్ లకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఇప్పటికే సింధియా వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు రిసార్ట్ కు చేరుకున్నారు. వారంతా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కమల్ నాధ్ ప్రభుత్వం కూలిపోక తప్పదు. 17 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు మంత్రులు ఉండటం విశేషం.
Next Story