బ్రేకింగ్ : రేపటి నుంచి అన్నీ తెరుచుకుంటున్నాయ్.. కొన్ని మాత్రం
మే 31వ తేదీ వరకూ తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు [more]
మే 31వ తేదీ వరకూ తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు [more]
మే 31వ తేదీ వరకూ తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కంటెయిన్మెంట్ జోన్ లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలన గ్రీన్ జోన్ లుగా మారుస్తున్నామన్నారు. 1452 కుటుంబాలు మాత్రమే కంటెయిన్మెంట్ జోన్ లో ఉన్నాయన్నారు. ఇక్కడ మాత్రం ఆంక్షలు కొనసాగుతాయని కేసీఆర్ చెప్పారు. కంటెయిన్ మెంట్ జోన్ లో ఉన్న వారిక ప్రభుత్వమే సరుకులు అందిస్తుందన్నారు. కరోనాకు ఇప్పట్లో వ్యాక్సిన్ రాదని నిపుణులు చెబుతున్నారన్నారు. కరోనాతో కలసి జీవించడమే మనముందున్న మార్గమని చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జీవనం కొనసాగించాల్సి ఉంటుందన్నారు.
అన్ని వ్యాపారాలకూ….
హైదరాబాద్ నగరం తప్ప అన్ని ప్రాంతాల్లో అన్ని వ్యాపారాలు తెరుచుకోవచ్చన్నారు. హైదరాబాద్ లో కంటెయిన్మెంట్ ప్రాంతాలు మినహాంచి మిగిలిన చోట సరి, బేసి సంఖ్యలో షాపులు తెరుచుకోవచ్చన్నారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయన్నారు. సిటీ బస్సులు తిరగవనిచెప్పారు. అంతరాష్ట్ర బస్సులకు కూడా అనుమతి లేదన్నారు. సిటీలో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఉంటుందన్నారు. రాష్ట్రాల మధ్య ప్రజా రవాణా ఉండదన్నారు. సెలూన్లు తెరుచుకోవచ్చన్నారు. ఈకామర్స్ కు అనుమతి ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు వందశాతం పనిచేసుకోవచ్చన్నారు. కాకుంటే కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు కూడా తెరుచుకోవచ్చన్నారు. కర్ఫ్యూ రాష్ట్ర మంతటా రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఉంటుందన్నారు. అన్ని రకాల విద్యాసంస్థలు బంద్ ఉంటాయన్నారు. మాస్క్ లేకుంటే జరిమానా విధిస్తామన్నారు. అవసరం ఉంటే తప్ప బయటకు రాకపోవడమే మంచిదన్నారు. త్వరలోనే కరోనా నుంచి బయటపడతామని చెప్పారు.