జగన్ కూడా ఏం చేయలేడు
ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో జగన్ కలిపారనిచెబుతున్నారని, కానీ జగన్ కూడా ఏం చేయలేరని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. జగన్ ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసిందని, అంత [more]
ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో జగన్ కలిపారనిచెబుతున్నారని, కానీ జగన్ కూడా ఏం చేయలేరని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. జగన్ ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసిందని, అంత [more]
ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో జగన్ కలిపారనిచెబుతున్నారని, కానీ జగన్ కూడా ఏం చేయలేరని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. జగన్ ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసిందని, అంత మాత్రాన ఏదో జరిగిందని అపోహ పడవద్దని కేసీఆర్ తెలిపారు. ఆరు నెలల్లో ఏపీలో ఆర్టీసీ పరిస్థితి కూడా తెలుస్తుందన్నారు. తెలంగాణాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసంభవమని కేసీఆర్ చెప్పారు. ఆర్టీసీని ఇక ఎవరూ కాపాడలేరన్నారు. దీనికి యూనియన్లు, రాజకీయ పార్టీలే కారణమని తెలిపారు. రోడ్డుకెక్కినా ఏం పరవాలేదు. ఎన్ని రోజులు చేస్తారో చేయమనండని కేసీఆర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ ఆస్తుల కోసమేననడం అర్థం పర్థం లేని వాదన అని అన్నారు. గొంతుకోసమంటామని యూనియన్లు అంటుంటే తాము ఏం చేస్తామన్నారు. నన్ను యూనియన్ నాయకులు తిట్టి సమస్యలు పరిష్కరించుకోగలరా? అని అన్నారు. కార్మికులు నిజంగా ఆర్టీసీని బతికించాలనుకుంటే ఎక్కడికక్కడ జాయిన్ కావాలన్నారు.