అనుకున్నదే జరుగుతుందా ...?
కాకతీయ కాలువ ద్వారా నీటివిడుదల డిమాండ్ చేస్తూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఆందోళన చేస్తున్నారు రైతులు. దాంతో తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద యుద్ధవాతావరణం కొనసాగుతూనే వుంది. గత పదిరోజులుగా ప్రాజెక్ట్ సమీపంలోని రైతులు తక్షణం నీటిని విడుదల చేయాలంటూ పెద్దఎత్తున ఉద్యమిస్తూనే వున్నా సర్కార్ వారిని అడ్డుకుంటూ వస్తుంది. ఖాకీల వలయంలో శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రాంతం లో ఎప్పుడు ఏం జరుగుతుందో నన్న ఉద్రిక్త వాతావరణం ఆందోళన రేకెత్తిస్తుంది. అటు రైతులు ఇటు సర్కార్ పట్టువిడుపు లేకుండా ఉండటంతో అంతటా టెన్షన్ టెన్షన్. వేలాది మంది పోలీసులు ఒక పక్క అదుపుచేయలేనంత వచ్చి పడుతున్న జనం మరోపక్క . గత పదిరోజులుగా నడుస్తున్న ఈ పోరాటం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తం అవుతూ వస్తుంది.
గ్రామానికి రెండువందలు ...
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి సమీపంలో వున్న 13 గ్రామాలు సమస్యాత్మకంగా గుర్తించిన అధికారులు ప్రతి ఊరిలో పికెట్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామంలో రెండు వందలమంది పోలీసులు రైతులు అక్కడినుంచి రోడ్డెక్కకుండా కాపలా కాస్తున్నారు. అదేవిధంగా ప్రాజెక్ట్ వద్ద ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు రెండువేలమంది పోలీసులు అను నిత్యం పహారా కాస్తున్నారు. మరోపక్క ఈ సీజన్ లో పర్యాటకులతో పోటెత్తే ప్రాజెక్ట్ వద్దకు వారిని అనుమతించడం లేదు పోలీసులు. దాంతో వేలాదిమంది టూరిస్ట్ లు నిరాశగా వెనుతిరుగుతున్నారు. ఇదిలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నీటి విడుదల చేసేది లేదని అంటుంది ప్రభుత్వం. ఆ ప్రాంత టీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు ఆందోళన పెరిగిపోతుంది. రైతుల తిరుగుబాటు, ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుంది అన్న భయం అక్కడ ఇరువర్గాల్లో వ్యక్తం అవుతుంది.
- Tags
- indian national congress
- irrigation water
- k chandrasekhar rao
- kakathiya canal
- police
- rahul gandhi
- sirram sagar project
- telangana
- telangana rashtra samithi
- ts politics
- కాకతీయ కాలువ
- కె. చంద్రశేఖర్ రావు
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ
- తెలంగాణ రాష్ట్ర సమితి
- పోలీసులు
- భారత జాతీయ కాంగ్రెస్
- రాహుల్ గాంధీ
- శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు
- సాగునీరు