బ్రేకింగ్ : లాక్ డౌన్ ను ఎత్తి వేయడం అంత ఈజీ కాదు
లాక్ డౌన్ ను మరి కొంత కాలం కొనసాగిస్తే మంచిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 22 దేశాలు కంప్లీట్ గా లాక్ [more]
లాక్ డౌన్ ను మరి కొంత కాలం కొనసాగిస్తే మంచిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 22 దేశాలు కంప్లీట్ గా లాక్ [more]
లాక్ డౌన్ ను మరి కొంత కాలం కొనసాగిస్తే మంచిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 22 దేశాలు కంప్లీట్ గా లాక్ డౌన్ చేశాయన్నారు. బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూపు నివేదిక ప్రకారం జూన్ వరకూ లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పిందన్నారు. లాక్ డౌన్ తో రోజూ ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడుతున్నామని చెప్పారు. కరోనాకు ఎటువంటి మందు లేకపోవడంతో లాక్ డౌన్ ఎత్తివేస్తే మరింత ప్రమాదం ముంచుకొస్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ ను కొనసాగించాలన్నదే తన అభిప్రాయమని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్ప మరో గత్యంతరం లేదని కేసీఆర్ చెప్పారు. లాక్ డౌన్ తో ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్నా మనిషి ప్రాణాలు కంటే ముఖ్యం కాదన్నారు. లాక్ డౌన్ ఎత్తివేయడం అంత ఈజీ కాదన్నారు. ఇండియాలో లాక్ డౌన్ కొనసాగక తప్పని పరిస్థితి నెలకొని ఉందన్నారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే ప్రజలను కంట్రోల్ చేయలేమని చెప్పారు.
ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నా….
కరోనా వైరస్ ప్రబలటం ప్రారంభమయిన తర్వాత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుందని కేసీఆర్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారితో కట్టడి చేయాలని భావించి కఠిన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. లాక్ డౌన్ పాటించడంతో గణనీయమైన విజయం సాధించామని కేసీఆర్ తెలిపారు. దేశ జనాభా పరంగా చూస్తే కేవలం 4,314 మందికి మాత్రమే కరోనా వ్యాధి సోకిందన్నారు. 122 మంది దేశంలో కరోనాతో మరణించారన్నారు. భారత్ పై ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడిపై ప్రశంసలు కురిపిస్తున్నాయన్నారు. లేకుంటే సీరియస్ పరిస్థితిని మనం చూడాల్సి వచ్చేదన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశం కావడంతో ఇంకా వైరస్ వ్యాప్తి చెందేది అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అమెరికా వంటి దేశాలే ఈ వ్యాధిని తట్టుకోలేకపోతున్నాయన్నారు. న్యూయార్క్ లో శవాలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయని చెప్పారు. అదే పరిస్థితి మనకు వచ్చి ఉంటే కోట్ల మంది చనిపోయి ఉండేవారన్నారు.
మొదటి దశలో….
తొలి దశలో విదేశాల నుంచి వచ్చిన వారు, వారి ద్వారా ట్రాన్స్ మీట్ అయిన వాళ్లని 25,937 మందిని క్వారంటైన్ చేశామని కేసీఆర్ చెప్పారు. 50 మందికి మాత్రమే వీరిలో కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. వీరిలో 30 మంది విదేశాల నుంచి వచ్చిన వారు, మిగిలిన 20 మంది వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకిందన్నారు. వీరిలో ఎవరూ మరణించలేదని కేసీఆర్ చెప్పారు. వీరిలో 35 మంది డిశ్చార్జ్ అయిపోయారు. మిగలిన 15 మంది ఎల్లుండి లోపు డిశ్చార్జ్ అయిపోతారని కేసీఆర్ చెప్పారు.ఈ నెల 9వ తేదీలోపు తొలిదశలో కరోనా సోకిన వారందరినీ ఇళ్లకు పంపుతామన్నారు.
మర్కజ్ మసీదు ప్రార్థనల ఘటన తర్వాత…..
రెండో దశలో నిజాముద్దీన్ సంఘటనలో 364 మందికి కరోనా సోకిందన్నారు. వీరిలో పది మంది ఇండోనేషియా వాళ్లున్నారు. వాళ్లు డిశ్చార్జ్ అయిపోయారన్నారు. 11 మంది ఇప్పటికి కరోనా తో చనిపోయారన్నారు. 308 మంది ఇప్పుడు ట్రీట్ మెంట్ లో గాంధీ ఆసుపత్రిలో ఉన్నారన్నారు. నిజాముద్దీన్ ఘటన తర్వాత 1089 మందిని గుర్తించామని చెప్పారు. 35 మంది మాత్రం ఇంకా తెలంగాణకు రాలేదన్నారు. వీళ్లకు సంబంధించి 172 మందికి కరోనా వైరస్ సోకిందన్నారు. మరణించిన వాళ్లంతా నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వాళ్లు, వాళ్ల నుంచి సోకిన వాళ్లే. లాక్ డౌన్ ను కొనసాగించదలచుకుంటే తాము మరికొన్ని రోజులు కొనసాగిస్తామన్నారు. ప్రజలు కూడా సహకారం అందించాలన్నారు. మరణాలను మిగిల్చే విషాదాన్ని దేశం భరించలేదని కేసీఆర్ చెప్పారు. ఈ విషయంలో కఠినంగా ఉంటామని హెచ్చరించారు. తమను ఇబ్బంది పెడుతున్నారన్న భావన నుంచి ప్రజలు బయటకు రావాలన్నారు. ఎవరికి పాజిటివ్ వచ్చినా వారు గాంధీ ఆసుపత్రిలో ఉండాాల్సిందేనన్నారు. వైద్య సిబ్బందికి పదిశాతం అదనపు వేతనాన్ని వారికి సీఎం గిఫ్ట్ కింద ఇస్తామని కేసీఆర్ చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులు 95,392 మంది ఉన్నారని, వీరికి పూర్తి వేతనం ఇస్తామని, వారికి కూడా సీఎం గిఫ్ట్ కింద జీవీఎంసీ కార్మికులకు 7,500లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు.