రద్దు రేపే...అంతా సిద్ధమేనా?
రేపు అసెంబ్లీ రద్దవుతుందా? అంతా ఊహించినట్లుగానే కేసీఆర్ అడుగులు వేస్తున్నారా? రేపు మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ మేరకు మంత్రులకు సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు వెళ్లాయి. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ ఈరోజుే వరాలు ప్రకటించే అవకాశముంది.
చకా..చకా...జీవోలు......
జీవోలు చకచకా విడుదల అవతున్నాయి. వివిధి నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటికీ పరిష్కారం చూసే విధంగా జీవోలు విడుదల అవుతున్నాయి. ఈరోజు మంత్రులకు కేబినెట్ అజెండా ఇవ్వాలని నిర్ణయించారు. నిన్న రాత్రంతా మంత్రులందరూ ఫైళ్ల పరిశీలనలోనే గడిపారు. రేపు మంత్రులంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలు అందడంతో హైదరాబాద్ కు మంత్రులు చేరుకుంటున్నారు. రేపు మంత్రివర్గం సమావేశం తర్వాత నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి అసెంబ్లీ రద్దుకు మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.