ఫామ్ హౌస్ లో చేస్తున్నది ఇదే ...?
అసెంబ్లీ రద్దు చేసేశారు. అనుకున్నట్లే ప్రజాశీర్వాదానికి షెడ్యూల్ కన్నా ముందే రంగంలోకి దిగారు. పార్టీ అభ్యర్థుల టికెట్లు ఖరారు చేసేశారు. ప్రత్యర్థులకు తొడగొట్టి సవాల్ విసిరారు. కారు గేరు మార్చి స్పీడ్ పెంచి అందరికన్నా తెలంగాణాలో ప్రచారంలో దూసుకుపోతుంది. అన్ని సెట్ చేసిన గులాబీ బాస్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తన ఫామ్ హౌస్ లో ఉండి పోయారు. ఆయన ఇలా తెరవెనక్కు వెళ్ళడంతో అర్ధం కాక అన్ని పార్టీలు జుట్టు పీక్కుంటున్నాయి.
లోపల కెసిఆర్ చేసేది ఇదే ...
కెసిఆర్ ఏమి చేసినా వెరైటీనే. తాజాగా తెలంగాణాలో ఎన్నికల కదనరంగంలో ఆయన కొద్ది రోజులుగా దూరంగా వుండటానికి అనేక కారణాలు చెబుతున్నాయి గులాబీ శ్రేణులు. టి బాస్ అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల పనితీరు నిశీతంగా గమనిస్తూ పార్టీ అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుత ప్రచార బాధ్యతలన్నీ కుమారుడు కెటిఆర్, అల్లుడు హరీష్ రావు, కుమార్తె కవితలపై మోపారు. ఆయన భారీ ప్రచారానికి తెరతీసేందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.
అక్టోబర్ 3 నుంచి దుమ్ము రేపనున్న కారు ...
కారు జోరు అక్టోబర్ 3 నుంచి మొదలు కాబోతుంది. కారు డ్రైవింగ్ సీట్ లోకి గులాబీ బాస్ వచ్చేస్తారు. 50 రోజుల్లో వంద సభలు నిర్వహించాలన్న ప్రణాళికకు టి బాస్ తుది మెరుగులు దిద్దేస్తున్నారు. ఇప్పటికే వారం పాటు కేసీఆర్ పాల్గొనబోయే షెడ్యూల్ పార్టీ ప్రకటించింది. నిన్న మొన్నటివరకు సైలెంట్ అయిన టి బాస్ సుడిగాలిలా తెలంగాణ రణక్షేత్రంలోకి దుకనున్నారు. సొంత పార్టీలో బలం, బలహీనతలు, ప్రత్యర్థుల బలం బలహీనతలు ఇప్పటికే అంచనా వేసిన గులాబీ దళపతి ఏమి చేయబోతారన్నది ఆసక్తికరంగా మారింది.
- Tags
- bharathiya janatha party
- chief minister
- farm house
- harish rao
- indian national congress
- k chandrasekhar rao
- kavitha
- ktr
- telangana
- telangana jana samithi
- telangana rashtra samithi
- ts politics
- కవిత
- కె. చంద్రశేఖర్ రావు
- కేటీఆర్
- కోదండరామ్
- టీ.ఎస్. పాలిటిక్స్
- తెలంగాణ
- తెలంగాణ జన సమతి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- ఫామ్ హౌస్
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- ముఖ్యమంత్రి
- హరీశ్ రావు