Mon Dec 23 2024 12:06:24 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ ఎదుటకు ఐదోసారి అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ ఎదుటకు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుకావాలి
వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ ఎదుటకు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుకావాలి. ఈ మేరకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగుసార్లు విచారించిన సీబీఐ అధికారులు ఐదోసారి వైఎస్ అవినాష్ రెడ్డిని విచారిస్తున్నారు.
అరెస్టా? విచారణ?
మధ్యాహ్నం మూడు గంటలకు పిలవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా? అన్న అనుమానం కలుగుతుంది. నిన్ననే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు పులివెందుల వెళ్లి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించి వదిలేస్తారా? లేదా? అరెస్ట్ చేస్తారా? అన్నది నేడు తేలనుంది.
Next Story